బ్రిటన్ ఎన్నికలలో భారత సంతతి విజయకేతనం!

బ్రిటన్ సాధారణ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 26 మంది భారత సంతతికి చెందిన వారు హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవి చూసిన కన్జర్వేటివ్ పార్టీ నుంచి అరడజను మంది భరత సంతతికి చెందిన సభ్యులు ఎన్నికవ్వగా, విజయం సాధించిన లేబర్ పార్టీ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైన వారు ఏకంగా 19 మంది ఉన్నారు. ఇక లేబర్ డెమొక్రటిక్ పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికయ్యారు.

 పార్టీల వారీగా ఎన్నికైన భారత సంతతికి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నుంచి బ్రిటన్ మాజీ ప్రధాని  రిషి సునక్, బ్రావెర్ మేన్, ప్రీతీ పటేల్. క్లారీ కౌంటినో, గగన్ మొహీంద్రా,  షివానీ రాజాలు హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు.

ఇక లేబర్ పార్టీ నుంచి ఎన్నికైన భారత సంతతికి చెందిన  సీమా మల్హోత్రా, వలేరీ వాజ్, లిసా నాండీ, ప్రీత్ కౌర్, తన్మన్ జీత్ సింగ్ దేశి, నవెందు మిశ్రా, నాడియా విట్ హోం, జాస్ అథ్వాల్. బాగీ శంకర్, సత్వీర్ కౌర్, హర్ ప్రీత్ ఉప్పల్, వారిందర్ జుస్, గురీందర్ జోసాన్, కనిష్కనారాయణ్, సోనియాకుమార్, సురీనా బ్రాకెన్ బ్రిడ్జి, కీర్తి కీర్తి ఎన్టవిజిల్, జీవన్ సంధీర్, సోజన్ జోసెఫ్ ఉన్నారు. అలాగే లేబర్ డెమొక్రాట్స్ నుంచి మునీరా విల్సన్ హౌస్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికయ్యారు.