బెయిలు కోసం సుప్రీంకు కవిత!

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిలు కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఢిల్లీ హైకోర్టు కవిత బెయిలు పిటిషన్లను తిరస్కరించిన నేపథ్యంలో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఇలా ఉండగా మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితతో శుక్రవారం (జులై 5) తెలంగాణ మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీష్ రావు ములాఖత్ అయ్యారు.

 అనంతరం ఢిల్లీలో వారు న్యాయనిపుణులలో సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేయడంపై చర్చించారు. సుప్రీం కోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిలు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆమె బెయిలు పిటిషన్ దాఖలు అయ్యే వరకూ కేటీఆర్, హరీష్ రావులు హస్తినలోనే మకాం వేసే అవకాశం ఉంది.

విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 8న కవిత బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా తీహార్ జైలులో కవితతో ములాఖత్ అయిన కేటీఆర్, హరీష్ రావులు కవితకు ధైర్యం చెప్పారు. ఆమెక త్వరలోనే బెయిలు వస్తుందని భరోసా ఇచ్చారు.  మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.