నాన్ వెజ్ రోజూ తిన్నాడు.. రక్తం తెల్లగా మారింది...
posted on Jun 14, 2017 5:22PM

కొంతమందికి మాంసాహారం అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. ముక్క లేనిదే ముద్ద దిగని వారు చాలామంది ఉంటారు. కానీ ఏదైనా అతిగా తింటే అది ప్రమాదకరమే. అలానే జరిగింది ఇప్పుడు. మాంసాహారం ఎక్కువ తినడంతో ఓ మనిషి రక్తం ఏకంగా తెల్లగా మారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చావో అనే 40 ఏళ్ల వ్యక్తికి మాంసాహారం అంటే చాలా ఇష్టం. అలా తిని తిని ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. ఒకరోజు అతనికి విపరీతమైన కడుపునొప్పి పట్టుకుంది. దీంతో వైద్యుల వద్దకు వెళ్లగా అతడికి బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పారు. విచిత్రం ఏమిటంటే, రక్తం శాంపిల్ తీస్తుంటే అతడి శరీరంలోంచి ఎర్ర రక్తానికి బదులు తెల్లని రక్తం వచ్చింది. దీంతో ఆశ్యర్యపోయిన వైద్యులకు.. ఆతరువాత విషయం అర్దమైంది. ఆ వ్యక్తి మాంసాహారం అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్లాస్మాలో విపరీతంగా కొవ్వు పేరుకుపోయిందని, దీంతో రక్తం ఇలా తెల్లగా మారిపోయిందని వైద్యులు వివరించారు. అయితే వెంటనే చికిత్స చేయడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు చెప్పారు.