ఢిల్లీలో రోడ్డు పాలైన 20 వేల లీటర్ల పెట్రోల్

దేశ రాజధాని ఢిల్లీలో 20 వేల లీటర్ల పెట్రోల్ రోడ్డు పాలైంది. నగరంలోని మూల్‌చంద్ అండర్‌పాస్ వద్ద పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లో తీసుకువెళ్తున్న 20 వేల లీటర్ల పెట్రోల్..ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం నేలపాలైంది. అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వాహన రాకపోకలను పోలీసులు నిషేధించారు. దీంతో భారీ ట్రాఫీక్ జాం ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu