దారుణం.. కన్నతండ్రి ఎదుటే అత్యాచారం...


గుజరాత్  లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారాలు జరిగేవి. కానీ ఇప్పుడు కన్నతండ్రి ఎదుటే ఓ బాలికపై అత్యాచారాని పాల్పడ్డారు కొంతమంది కీచకులు. వివరాల ప్రకారం..గుజరాత్ లోని భుత్ పాగ్లా గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు వారి తండ్రితో కలిసి వెళుతుండగా.. కొంత మంది ఆరుగురు దుండగులు వారిని కిడ్నాప్ చేశారు. అక్కడితో ఆగకుండా... కదులుతున్న కారులో తండ్రి ఎదుటే బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత వీరిని మాందవ్ గ్రామంలో వదిలేశారు. పోలీసు కేసు పెడితే చంపేస్తామని బెదిరించారు. అయినా కూడా వారు ధైర్యంతో పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు కుమత్ బారియా, గణపత్ బారియా, నర్వాత్ బారియా, సురేశ్‌ నాయక్, గోప్ సిన్హ్ బారియాలు అనే ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu