స్మిత్ మళ్లీ సెంచరీ.. ఆసీస్ 272/4..
posted on Mar 16, 2017 4:57PM

ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాంచీలోని జేఎస్‌సీఏ మైదానం వేదికగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 89 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత స్టీవ్ స్మిత్-హ్యాండ్ స్కాంబ్లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఆ తరుణంలో స్మిత్ కు జత కలిసిన మ్యాక్స్ వెల్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు.మాక్స్‌వెల్ (74 బ్యాటింగ్; 121 బంతుల్లో 4×4, 2×6) టెస్టుల్లో తొలి అర్ధశతకం సాధించాడు. ఆపై స్మిత్ సెంచరీ చేశాడు. 227 బంతుల్లో10 ఫోర్లు సాయంతో స్మిత్ శతకం నమోదు చేశాడు. ఇది స్మిత్ కెరీర్ లో 19వ టెస్టు సెంచరీ. స్మిత్, మాక్స్ జోడీ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 83 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 272/4తో నిలిచింది.