చేనేతపై పాట రాసిన ఐఏఎస్ అధికారి

చేనేత కార్మికుల‌ ఆనందాలు... బాధ‌లు... వాళ్ల జీవన శైలిని ఆవిష్కరిస్తూ... ఐఏఎస్ ఆఫీస‌ర్ న‌ర‌హ‌రి ఒక అద్భుతమైన పాట 'మేమేగా నేతన్నలం' రాశారు. చేనేత కార్మికుల వేతనాలను ఆవిష్కరిస్తూ పల్లెటూరి జానపద గేయ రచయితలు పలు గీతాలు రాశారు. కానీ, ఒక ఐఏఎస్ అధికారి పాట రాయడం బహుశా ఇదే తొలిసారి అనుకుంట. పాటలోని ప్ర‌తి మాట నేత‌న్న‌ల‌ జీవితంలోని కష్టాలను అణువ‌ణువున వర్ణిస్తుంది. పాట విన్న ప్ర‌తి ఒక్కరి మ‌న‌స్సుని హ‌ద్దుకుని ఆలోచింప‌చేస్తుంది. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఐ.ఎన్‌.పి.ఆర్ క‌మీష‌న‌ర్ గా విధులు నిర్వహిస్తున్న పి. న‌ర‌హ‌రి గతంలో స్వచ్ఛ భార‌త మిష‌న్‌లో భాగంగా ఒక పాట ` హో హ‌ళ‌ల‌.. `  అని రాసి ఇన్‌డోర్ ప్ర‌జ‌ల‌ని మ‌న చుట్టూ ఉన్న ప‌రస‌రాల‌ను స్వ‌చ్ఛంగా ఉంచుకోడానికి స్ఫూర్తిని నింపారు. అక్కడి ప్రజలను ఉత్తేజపరిచి ఇన్‌డోర్‌కి స్వ‌చ్ఛ భార‌త మిష‌న్‌లో ఉత్త‌మ స్థానం రావ‌డానికి కీల‌క పాత్ర పోషించారు. ఈసారి తన మాతృభాష తెలుగులో నేత‌న్న‌ల జీవితాన్ని వ‌ర్ణించి వాళ్ల క‌ష్ట సుఖాల‌ను ప్ర‌జ‌ల‌కు అతి ద‌గ్గ‌రిగా తీసుకెళ్లి తన వంతు సహాయం చేస్తున్నారు. యువ సంగీత ద‌ర్శ‌కుడు రిషి కింగ్ సంగీత సారథ్యంలో యువ గాయకి పాయ‌ల్ దేవ్ విన‌సొంపైన గానం న‌ర‌హ‌రి గొప్ప ఆలోచ‌న‌కి ప్రాణం పోసింది. చేనేత‌ల దినోత్స‌వంగా వాళ్ల జీవితాల‌ను`మేమేగా నేత‌న్న‌లం` పాట రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు.