హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!?.. ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బిగ్ షాక్. మెట్రో రైలు చార్జీలు దగ్గరదగ్గర 50 శాతం పెరగనున్నాయి. అతి త్వరలోనే మోట్రో రైలు చార్జీల పెంపు ఉంటుందని మెట్రో వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పెంపు పది రూపాయల నుంచి 60 రూపాయల వరకూ ఉంటుంని చెబుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు.

భారీ నష్టాలలలో ఉన్న మెట్రో రైల్ ఆ నష్టాల నుంచి బయటపడేందుకు చార్జీల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తోంది. ఇప్పటికే మెట్రో హాలీడే సేవర్ కార్డును మెట్రో రద్దు చేసింది. అలాగే ప్రయాణీకులకు పది శాతం రాయితీని కూడా రద్దీ సమయాల్లో ఎత్తివేసింది. వాస్తవానికి మెట్రో  ధరల సవరణకు ఎల్ అండ్ టీ సంస్థ 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది . అయితే అప్పటి కేసీఆర్ సర్కార్ అందుకు అంగీకరించలేదు.  అయితే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడం,  బెంగళూరు మెట్రో ఛార్జీలు   44 శాతం పెంచిన నేపథ్యంలో  హైదరాబాద్ మెట్రో సైతం చార్జీలకు పెంపునకు సిద్ధమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu