పాతబస్తీ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి..బాధితులను ఆదుకుంటామని హామీ
posted on May 18, 2025 12:10PM

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసా కల్పించారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలు వద్దని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం తెలిపారు