బీపీ... ఇలా చేస్తే హ్యాపీ
posted on May 1, 2018 12:01PM
బీపీ (blood pressure) ఇప్పుడు చాలామందిలో కనిపిస్తోంది. ఇటీవల వైద్య మార్గదర్శకాల ప్రమాణాల ప్రకారం ఒక వ్యక్తి బీపీ 140- 90 కంటే ఎక్కువగా ఉంటే అది అసాధారణం. అలాంటప్పుడు అతనికి ఎలాంటి బీపీ లక్షణాలు కనిపించకపోయినా చికిత్స ప్రారంభించాల్సిందే. సాధారణంగా హైబీపీతో బాధపడుతున్న రోగులకు తమకు బీపీ వ్యాధి ఉన్న సంగతి తెలియదు. ఈ వ్యాధి ఉన్న వారు తరుచుగా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా వారు కిడ్ని సరిగా పనిచేయకపోవడం, గుండెపోటు వంటి సమస్యలకు గురైతే తప్ప వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు. కుటుంబంలో ఎవరికైనా హైబీపీ ఉన్నట్లయితే 30 ఏళ్ల వయసులోనే చెక్ చేయించుకుంటే దానిని నియంత్రించవచ్చు.
డాక్టర్లు రోగి అవసరానికి తగిన మందులను, అలాగే జీవన విధానంలో మార్పులను అంటే వాకింగ్, యోగా, ఉప్పు వాడకం మొదలైన విషయాలను సూచిస్తారు. బీపీ 140 నుంచి 159 ఎంఎం మధ్య ఉంటే సిస్టాలికే ప్రెషర్ గా 90-90 మధ్య ఉంటే డైయాస్టాలిక్ ప్రెషర్ గా గుర్తిస్తారు. ఒక్కసారి హైబీపీ సమస్య మొదలైతే ఒక్కసారి మందులు వాడితే పోయే జబ్బు కాదు. మనమే దానిని కంట్రోల్‌లో పెట్టుకోవాలి.
చికిత్స ప్రారంభించడానికి ముందు మన జీవనజైలిలో కొన్ని మార్పులు అవసరం. ఒక 6 వారాల నుండి 3 నెలలు వరకు మన జీవన విధానాన్ని పరిశీలించుకోవాలి. ఇలా చేయకపోతే మందులు ప్రభావవంతంగా పని చేయవు. దీర్ఘకాలికంగా మందులు వాడినా ఎలాంటి ప్రమాదం ఉండదు. అతి తక్కువ కేసుల్లో మాత్రమే దుష్ర్పభావం చూపుతుంది. అలాంటి సమయంలో కూడా డాక్టర్లు వెంటనే మరో రకం మందు ఇచ్చి నియంత్రిస్తారు. నియంత్రణకు సాధ్యంకాని సెకండరీ హైబీపీ వల్ల అవయవాలు కాపాడుకోవడమే మన లక్ష్యం. ఎట్టిపరిస్థితిల్లోనూ మందులు మానకూడదు.
ఒక్కసారి మందులు వాడటం మానేస్తే మళ్లీ బీపీ పెరుగుతుంది. బీటా బ్లాకర్స్ లాంటి మందును వాడుతున్నప్పుడు కొందరు రోగుల్లో బీపీ సాధారణ వైద్యానికి లొంగనంతగా పెరిగిపోతుంది. కనుక హైబీపీ తగ్గినా మందులు మాత్రం వాడుతూనే ఉండాలి. సెకండరీ హైబీపీకి గురైన గర్భిణులు మాత్రం ఈ మందులు ఆపడం జరుగుతుంది. ఒక్కసారి హైబీపీ వ్యాధి వచ్చిందంటే ఇక జీవితం ముగిసిపోయినట్టే అనే అపోహను వదిలిపెట్టి, సరైన వైద్య విధానం ద్వారా నియత్రించి సాధారణ జీవనవిధానాన్ని కొనసాగించవచ్చు. అందుకు మనం చేయాల్సింది క్రమంతప్పకుండా మందులు వేసుకోవడమే. కొంతమందికి వ్యాధిని గుర్తించలేక దురదృష్టవశాత్తు కిడ్నీలు దెబ్బతినడం, గుండెపోటు లాంటి సమస్యలు వస్తున్నాయి.
ఇలాంటి వారికి ముందు వారి జీవనవిధానంలో అలవాట్లను మార్చాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల శరీరంలో గుండె రక్త ప్రసారమయ్యే తీరు, కిడ్నీ పని విధానం బాగుపడతాయి. ఎవరికైనా షుగర్ లేదా ఇతర సమస్యలు ఉంటే అవసరాన్ని బట్టి ఇతర మందులను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్, సంతాన నిరోధక మాత్రలు లాంటి మందులను తీసుకున్నపుడు మాత్రం అవి బీపీని ప్రభావితం చేసి ఇతర సమస్యలకు కారణమవుతాయి. కనుక ఎలాంటి మందులనైనా వైద్యుల సలహాల ప్రకారమే తీసుకోవాలి.