ఫైల్స్ సమస్య మూడు రోజుల్లోనే నయం కావాలంటే ఈ పవర్ఫుల్ చిట్కా ఫాలో అవ్వాల్సిందే..!
posted on Dec 12, 2024 9:30AM
మలబద్ధకం సమస్య దీర్ఘకాలం కొనసాగినప్పుడు, పైల్స్ ఏర్పడతాయి. ఇది తీవ్రమైన సమస్య. పైల్స్ ఫిస్టులా వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఫైల్స్ వచ్చినవారు దాని నివారణకు పైల్స్ తొలగించడం కోసం శస్త్రచికిత్స, ఇంజెక్షన్ సహాయం తీసుకుంటారు. కానీ చాలా సార్లు ఈ చికిత్స ప్రభావవంతంగా ఉండదు. ఎందుకంటే మలబద్దకం సమస్యను నివారించకపోతే పైల్స్ సమస్య మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి రావచ్చు. యోగా గురువు బాబా రామ్‌దేవ్ రెండు వేల సంవత్సరాల నాటి పద్దతులను అనుసరించడం ద్వారా కేవలం 3 రోజుల్లోనే ఈ సమస్య నయమవుతుందని పేర్కొన్నారు. అసలు పైల్స్ సమస్య లక్షణాలేంటి? పైల్స్ తగ్గించే పద్దతులు ఏంటి? పైల్స్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? తెలుసుకుంటే..
పైల్స్ లక్షణాలు..
మలంతో పాటు ఎర్రటి రక్తం రావడం.
మలద్వారం వద్ద దురద రావడం.
మూత్ర విసర్జన చేసిన వెంటనే మలం ఒత్తిడి.
మలద్వారం వద్ద గడ్డలాగా ఏర్పడటం.
మలద్వారం వద్ద నొప్పిగా ఉండటం.
పైల్స్ కు బాబా రాందేవ్ చెప్పిన చిట్కాలు..
పాలు, నిమ్మకాయ..
బాబా రామ్ దేవ్ చెప్పిన టిప్స్ లో పాలు, నిమ్మకాయ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక కప్పు చల్లని పాలలో ఒక నిమ్మకాయ పిండాలి. తరువాత ఈ నిమ్మకాయ పిండిన పాలను వెంటనే తాగేయాలి. ఈ పాలను ఎక్కువసేపు ఉంచిదే పాలు పగిలిపోతాయి. కాబట్టి పాలలో నిమ్మరసం పిండగానే తాగెయ్యాలి. దీన్ని మూడు రోజుల పాటు తీసుకోవాలి. అయితే ఇందుకోసం గేదె పాలు తీసుకోకూడదు. దానికి బదులుగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలి.
అరటి, కర్పూరం..
పైల్స్ నివారణ కోసం అరటి, కర్పూరం కూడా ఉపయోగించవచ్చు. పండిన అరటిపండులో పావు వంతు తీసుకుని దాన్ని చీల్చాలి. దానిలో గ్రాముకు సమానమైన కర్పూరాన్ని ఉంచి ఆపై దానిని మింగాలట. ఇలా మూడు రోజులు తింటే పైల్స్ సమస్య కంట్రోల్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ చిట్కా ఫాలో అయ్యేవారు భీమసేని కర్పూరం వాడాలి.
పైల్స్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే..
పుష్కలంగా నీరు త్రాగాలి. మలద్వారం వద్ద దురద, నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజూ వ్యాయామం చేయాలి. పైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఘన ఆహారం, ఎక్కువ సేపు జీర్ణం అయ్యే ఆహారాలకు దూరం ఉండాలి. పైన చెప్పుకున్న చిట్కాలు పైల్స్ సమస్యను తగ్గిస్తాయని చెప్పారు తప్ప.. వైద్యులు ఇచ్చే ఔషధాలు, వైద్యులు చేసే ట్రీట్‌మెంట్ కు ఇవి ప్రత్యామ్నాయం కాదు. పైల్స్ సమస్య వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.
*రూపశ్రీ.