అసెంబ్లీలో సీఎం డాన్స్..
posted on Mar 12, 2015 5:18PM

సినిమా హీరోలే డాన్స్ చేస్తారా ఏంటీ నేను కూడా డాన్స్ చేస్తానంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డాన్స్ చేసి వార్తల్లోకెక్కారు. తన సెటైర్లతో ప్రత్యర్థులను తిప్పికొట్టే విదర్భసింగ్ ఈసారి అసెంబ్లీలో డాన్స్ తో ప్రతిపక్ష నేతలకు సమాధానం చెప్పారంట. ఇంతకీ విషయం ఏంటంటే, గత నెల జనవరిలో ముఖ్యమంత్రి కుమారుడు, యూత్ కాంగ్రెస్ కార్యకర్త విక్రమాదిత్య సింగ్ ఆధ్వర్యంలో భూసేకరణ బిల్లుకు వ్యతిరేక ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఘర్షణలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులు గురువారం అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు గందరగోళం సృష్టించారు. వారి నినాదాలకు సమాధానం చెప్పవలసిన ముఖ్యమంత్రి రిథమిక్‌గా హిప్ మూవ్ మెంట్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.