జస్ట్ పెళ్ళి... వెంటనే పరీక్ష...

 

పెళ్ళి ముఖ్యమా.. పరీక్ష ముఖ్యమా అనే ప్రశ్న ఆ అమ్మాయి ముందు నిలిచింది. దానికి ఆ అమ్మాయి రెండూ ముఖ్యమే అని స్పష్టంగా చెప్పేసింది. తాను చెప్పినట్టే చేసింది. రాజస్థాన్‌లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష వుందని, పెళ్ళిని మర్నాటికి మార్చాలని రిక్వెస్ట్ చేసింది. అయితే సోమవారం నాడు మంచి ముహూర్తం వుందని, ఆరోజే పెళ్ళి జరగాలని మగపెళ్ళివారు పట్టుబట్టారు. ఆ అమ్మాయి ఆరోజు పెళ్ళి పట్టుబట్టలు కట్టుకోవాల్సిందేనని కూడా పట్టుబట్టారు. దాంతో సంతోష్ ప్రజాపత్ తీవ్రంగా ఆలోచించింది. పెళ్ళికి, పరీక్షకి మధ్య ఒక గంట టైమ్ ఉంది కాబట్టి తాను పెళ్ళి చేసుకున్న వెంటనే అదే ఊళ్ళో వున్న పరీక్షా కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాస్తానని చెప్పింది. మగ పెళ్ళివారు మొదట్లో నసిగినప్పటికీ, చదువు మీద ఆ అమ్మాయికి వున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని అంగీకారం తెలిపారు. సోమవారం పెళ్ళి అయిన వెంటనే పెళ్ళి బట్టలతోనే పరీక్షా కేంద్రానికి వెళ్ళి ఆ అమ్మాయి పరీక్ష రాసింది. చదువంటే ఇంట్రస్ట్ ఇలా వుండాలి.. ఏమంటారు?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu