ట్రంప్ ను భర్త అని హిల్లరీ టంగ్ స్లిప్..
posted on Aug 6, 2016 6:05PM
.jpg)
రాజకీయ నేతలు అప్పుడప్పుడు నోరు జారుతుంటారు అది కామన్. ఇప్పుడు అలాగే టంగ్ స్లిప్ అయ్యారు హిల్లరీ క్లింటన్.. అది కూడా తన ప్రత్యర్ధి అయిన ట్రంప్ విషయంలో. ప్రస్తుతం హిల్లరీ క్లింటన్.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ పార్టీల నుంచి అధికారిక అభ్యర్థులుగా ఖరారైన తర్వాత వారు తమ మాటల దాడులను మరింతగా పెంచారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన నల్లజాతి, హిస్పానిక్ పాత్రికేయుల జాతీయ సంఘాల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ట్రంప్ ను తన ప్రత్యర్ధిగా చెప్పాల్సింది పోయి తన భర్తగా చెప్పింది. ‘‘నా హస్బ్... నా ప్రత్యర్థి మాట్లాడుతున్న దాని గురించి నేను చెప్పేదాన్ని పోల్చి చూస్తారని ఆశిస్తున్నాను’’ అని హిల్లరీ పేర్కొన్నారు. దీంతో తను చేసిన తప్పును తెలుకునేలోపే సభలో అది విని అందరూ నవ్వుకున్నారు. ఇక హిల్లరీ కూడా తన తప్పును తెలుసుకొని వెంటనే సర్దుకున్నారు.