ఆకలితో 500 ఆవులు మృత్యువాత..
posted on Aug 6, 2016 5:36PM

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 ఆవులు ఒకేసారి ఆకలితో చనిపోయాయి. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని హింగోనియా గోసంరక్షణ శాలలో సుమారు ఎనిమిది వేల ఆవులు ఉంటున్నాయి. అయితే గత కొద్దిరోజుల క్రితం వేతన చెల్లింపుల విషయంలో గోశాలలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో వాటిని సరిగా చూసుకునేవారు లేకపోయారు. కనీసం ఆహారం, నీరు అందించే వారు కూడా లేరు. ఇక అక్కడ కురుస్తున్న వర్షాలతో కారణంగా ఆహ ఆకలి బాధతో మృత్యువాత పడ్డాయి. గోశాలంతా బురదమయంగా అయిపోయింది. ఆవుపేడ కూడా కుప్పలుగా పేరుకుపోయింది. ఆ కారణంతో కొంతమంది అక్కడ శుభ్రం చేయడానికి రాగా అసలు విషయం బయటపడింది. ఆవులు అనారోగ్యంతో కాకుండా ఆకలి బాధతోనే మృతి చెందాయని వైద్యులు కూడా స్పష్టం చేశారు.