మోడీజీ.. వెల్‌కమ్ టూ తెలంగాణ
posted on Aug 7, 2016 10:15AM

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్రమోడీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ను ప్రధాని ఇవాళ మెదక్ జిల్లా కోమటిబండలో ప్రారంభించనున్నారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా రాష్ట్రానికి వస్తుండటంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రధాని చేరుకుంటారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులతో కలిసి మూడు ప్రత్యేక హెలికాఫ్టర్లలో మెదక్ జిల్లా కోమటిబండకు బయలుదేరుతారు. అక్కడ మిషన్ భగీరథను ప్రారంభించి, ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం ఐదుగంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుని, ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొని..పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.