ఎన్టీఆర్ జిల్లాలో హైటెన్షన్.. వైసీపీ టిడిపి మధ్య ఘర్షణ

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్   సెంటర్ లో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు చెప్పులు,  రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యాయి. ఒక ఎస్ ఐ, నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. 

గత అర్ధరాత్రి చినతిరునాళ్ల మహోత్సవంలో గొడవ జరిగింది. పసుపు కుంకుమ మావెంటే తీసుకెళతామని ఇరువర్గాలు గొడవ పడ్డాయి. దక్షిణ భారతంలో అతి ఎత్తయిన ప్రభగా  గుర్తింపు పొందిన ఈ ప్రభోత్సవం 1928 నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ప్రభ ముందు డప్పు వాయిద్యాలు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలను భక్తులను విశేషంగా ఆకర్షించాయి.  రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు చేశారు.  రంగు రంగుల విద్యుత్ దీపాల  ఆలంకరణతో ఇనుప ప్రభపై  ఉత్సవ విగ్రహాలను ఉరేగించారు.  గ్రామానికి చెందిన ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఇదే సమయంలో  ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.