ఐఎస్ఐ హనీ ట్రాప్ లో సల్వీందర్ సింగ్.!

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసులో గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సల్వీందర్ సింగ్ పై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎన్ఐఏ దర్యాప్తులో సల్వీందర్ సింగ్ ఐఎస్ఐ హనీ ట్రాప్ లో పడినట్టు తెలుస్తోంది. అంతేకాదు సల్వీందర్ సింగ్ గతంలో లేడి కానిస్టేబుళ్లను కూడా లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఎన్ఐఏ అధికారుల విచారణలో ఇంకా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాను తరుచుగా పంజ్ పీర్ దర్గాకు వెలుతుంటానని సల్వీందర్ సింగ్ అధికారులకు చెప్పాడు. అలా దర్గాకు వెళుతున్న సమయంలో ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్గా అధిపతి సోమ్ మాత్రం తాను ఎప్పుడూ సల్వీందర్ సింగ్ ను చూడలేదని, డిసెంబర్ 31వ తేదిన మొదటి సారి చూశానని చెప్పారు. అంతకు ముందు ఎన్నడూ ఆయన ఈ దర్గా దగ్గరకు రాలేదని, ప్రార్థనలు చెయ్యలేదని అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిల్విందర్ సింగ్ పై అనుమానాలు మరింత పెరిగాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu