ఉద్యోగమే కాదు.. ఆరోగ్యమూ ముఖ్యమే

 


 

కాస్త ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి... అంటూ స్త్రీలకు ఓ హెచ్చరిక చేస్తున్నారు అధ్యయనకర్తలు. ‘‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్’’ ఓ అధ్యయనం నిర్వహించింది. సుమారు మూడువేల మంది మహిళలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికర అంశాలు తెలిశాయి.

1. ఉద్యోగం చేసే మహిళల్లో 70 శాతం మంది కన్నా ఎక్కువమంది అనారోగ్యం బారిన పడుతున్నారనీ, అదీ 32 సంవత్సరాల వయసు  నుంచేనని తెలిసింది.

2. ఊబకాయం, నడుం నొప్పి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నట్టు కూడా తెలిసింది.

3. ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య ఇంచుమించు 22 శాతంగా వుంటే, 14 శాతం మహిళలు తీవ్ర సమస్యలతో పోరాడుతున్నట్టు వెల్లడైంది.

4. ఇక శారీరక అనారోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా మహిళలు తక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఒత్తిడి, ఒంటరితనం, ఆందోళన వంటివన్నీ మహిళలను తీవ్రస్థాయిలో ఇబ్బందిపెట్టే అంశాలని, వాటి నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని చెబుతున్నారు నిపుణులు.

ఈ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా మహిళలకి కొన్ని సూచనలు చెప్తున్నారు. అవి ఏంటంటే...

1. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
2. వ్యాయామం, ధ్యానం వంటివి జీవన శైలిలో భాగం కావాలి.

 

కుటుంబాన్ని, ఉద్యోగాన్ని రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించాలంటే మహిళలు తప్పకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. మరి ఆలోచించండి. మహిళల ఆరోగ్యం ప్రమాదకర స్థాయిలో ఉందని అధ్యయనాలు చెబుతున్నప్పుడు ఆరోగ్యకర జీవనశైలిని ఆచరించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అలాగే... మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తూ, వారికి ఇంటి పనుల్లో సహాయపడితే ఇంటి ఇల్లాలు ఆరోగ్యం వుంటుంది.

-రమ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News