ఈ ఒత్తిడితో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు!! 

మన శరీరంలో ఏ అయస్కాంత ప్రవాహమైతే ప్రవహిస్తుందో దాని స్విచ్ బోర్డు మన యొక్క రెండు అరచేతులలో, రెండు అరికాళ్లలో ఉంది. చిత్రంలో వేర్వేరు స్పర్శ బిందువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపబడ్డాయి. 1. మెదడు 2. మానసిక రోగం 3. పిట్యూటరీ 4. పీనియల్ 5. మస్తిష్క నర్క్స్ 6. గొంతు, కంఠము 8. థైరాయిడ్ 9. వెన్నుపూస 10. అర్ష్-మసా 11. ప్రోస్టేట్ 12. యోని మార్గము 13. జననేంద్రియము 14. గర్భాశయము 15. అండాశయము 16. నడుము, ప్రక్క ఎముకల క్రింది భాగం 17. తొడ 18. మూత్రాశయం 19. ప్రేగులు 20. గుదము 21. ఎపండిక్స్ 22. పిత్తాశయం 23. కాలేయం 24. భుజం 25. ప్యాంక్రియాస్ 26. కిడ్నీ 27. జఠరము 28. అడ్రిన్ 29. సూర్య కేంద్రం 30. ఊపిరి తిత్తులు  31. శక్తి కేంద్రము 33. నరము - చెవి 34. నరము - జలుబు 35. కన్ను 36. గుండె 37. కాలేయం 38. థాయమస్. 


ఒత్తిడి ఎలా కలిగించాలంటే…


ఇందులో అరచేతుల యొక్క, అరికాళ్ల యొక్క బిందువుల పైన వాటి సమీపంలో ఒత్తిడి కలిగింపబడుతుంది. ఇలా చెయ్యడం వల్ల బిందువుతో కలిసి ఉన్న అవయవాల వైపు అయస్కాంత ప్రవాహం జరుగుతుంది.


ఎలాగంటే - బ్రొటన వ్రేలియందున్న మస్తిష్క బిందువుపై ఒత్తిడి చేసినచో అయస్కాంత ప్రవాహము మస్తిష్కము వైపు ప్రవహిస్తుంది. అది మస్తిష్కమును అధిక క్రియాశీలము చేస్తుంది.


బ్రొటన వ్రేలితో గాని లేక చూపుడు వ్రేలితో గాని లేక మొనలేని పెన్సిల్తోగానీ బిందువులపై ఒత్తిడి చేయవచ్చు. ఏ బిందువుపై ఐనా 4-5 సెకండ్ల వరకు ఒత్తిడి కలిగించాలి. 1-2 సెకండ్ల ఒత్తిడిని కలిగించడం ఆపి తిరిగి ఒత్తిడి కలిగించాలి. ఇలా 1-2 ని॥ల వరకు పంపింగ్ చేసే విధంగా ఒత్తిడిని కలిగించాలి. తిరిగి భారముతో గూడిన మర్దనము చెయ్యాలి. బిందువుపై ఒత్తిడి భారము అనుభవంలోకి వచ్చేంత ఒత్తిడి మాత్రమే చెయ్యాలి. అధికంగా ఒత్తిడిని కలిగించకూడదు. సున్నితమైన చేతిపై తక్కువగా ఒత్తిడి కలిగించినా అది అనుభవంలోకి వస్తుంది. అంతఃస్రావి గ్రంధుల బిందువులు తప్పించి ప్రతి బిందువుపైనా అడ్డంగా ఉన్న బ్రొటనవ్రేలి ద్వారా భారము వేయుట వలన ఆవశ్యకమైన ఒత్తిడి పడగలదు. అంతఃస్రావి గ్రంధుల బిందువులపై అధిక ఒత్తిడి కలిగించడానికి నిలువు బ్రొటన వ్రేలిని పెన్సిలు లేక పెన్నును ఉపయోగించి చేయవచ్చు.


శరీరం యొక్క కుడిభాగమందలి అవయవాలందు బాధ కలిగినా లేక నొప్పి కలిగినా కుడి అరచేతి లేక కుడి అరికాలి బిందువులపై ఒత్తిడి చెయ్యాలి. ఇలాగే శరీరం యొక్క ఎడమ భాగములో బాధలకు తత్సబంధమైన ఎడమ అరచేతి లేక ఎడమ అరికాలు యొక్క ఒత్తిడి బిందువులపై ఒత్తిడి వేయాలి. శరీరం యొక్క వెనుక భాగము అంటే వెన్నెముక, జ్ఞాన తంతువులు, నడుము, సాయటికా నరము, తొడ మొ||వి వస్తాయి. వాటి కొరకు అర చేతి వెనుక భాగములో లేదా కాలిపై భాగములో ఒత్తిడి చేయవచ్చు. ఏ రోగానికైనా లేక అవయవ లోపానికైనా అరచేతి బిందువులపై రోజుకు మూడుసార్లు 1-2 ని॥ల వరకు ఒత్తిడి కలిగించవచ్చు. అరికాలి బిందువులపై ఒకేసారి 5ని॥ల వరకు ఒత్తిడి కలిగించవచ్చు. బిందువుల నొప్పి తగ్గనంత వరకు ఈ  చికిత్సను కొనసాగించవచ్చు.