కత్తి లాంటి కంటి చూపుకు అమేజింగ్ డ్రింక్ ఇది..!
posted on Dec 1, 2025 9:30AM

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాలలోకి కళ్లు చాలా ముఖ్యమైనవి. కంటిచూపు మెరుగ్గా ఉంటే జీవితంలో చాలా భాగం చాలా సవ్యంగా గడిచిపోతుంది. కానీ నేటి కాలంలో కంటిచూపు సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కరూ కళ్ల అద్దాలు ఉపయోగించడం, కంటి సంబంధ సమస్యలతో ఇబ్బంది పడటం చేస్తుంటారు. చాలామంది కంటి చూపు మెరుగవ్వడం కోసం సప్లిమెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ సంప్లిమెంట్లు అక్కర్లేకుండా కంటి చూపు కత్తిలా, పదునుగా మార్చే అద్బుతమైన డ్రింక్ ఒకటుంది. ఈ డ్రింక్ ను తీసుకుంటే కంటి అలసట తగ్గడంతో పాటు కంటి శుక్లం సమస్య కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ డ్రింక్ ఏంటో.. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో.. ఈ డ్రింక్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..
జామాకు టీ..
జామకాయ రుచికరమైన పండు మాత్రమే కాదు, దాని ఆకులలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. జామ ఆకులతో తయారుచేసిన టీ కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి చూపు జాగ్రత్తగా ఉండటానికి చాలా సహాయపడుతుంది.
జామాకులలో పోషకాలు..
జామాకులలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు, అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి కళ్ళకు పోషణ ఇస్తాయి. కంటి అలసటను తగ్గిస్తాయి. కంటిశుక్లం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
జామాకు టీ తయారీ విధానం..
తాజాగా ఉన్న ఆకుపచ్చ జామ ఆకులను తీసుకొని వాటిని బాగా కడిగి, దుమ్ము, రసాయనాలు వాటి మీద నుండి తొలగించాలి. ఒక పాన్‌లో రెండు నుండి మూడు కప్పుల నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత, జామ ఆకులను నీటిలో వేయాలి. ఆకులలోని పోషకాలు నీటిలో చేరతాయి. సుమారు 7-8 నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించాలి. ఆ తరువాత స్టౌ ఆప్ చేసి వడగట్టాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇందులో రుచి కోసం తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
జామాకు టీ ఇందుకే బెస్ట్..
జామ ఆకులలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది రెటీనాను బలపరుస్తుంది. రేచీకటి వంటి కంటి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
జామాకు టీ కళ్ళను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. తద్వారా కంటిశుక్లం, వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కంటి అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఎక్కువసేపు స్క్రీన్ వైపు చూడటం వల్ల కంటి అలసట, పొడిబారడం జరుగుతుంది. జామాకు టీ దీనిని తగ్గించడంలో సహాయపడుతుంది.
కళ్ల వాపు, ఎరుపు నుండి ఉపశమనం. దీనిలో ఉన్న శోథ నిరోధక లక్షణాలు కళ్ళ ఎరుపు, చికాకును తగ్గిస్తాయి .
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జామాకు టీ కళ్ళకు ఆక్సిజన్, పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. దీని వలన కంటిచూపులో స్పష్టత పస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...