తెలంగాణను ఆంధ్రాలో కలిపేయండి ! రాజకీయ డ్రామాలేంటన్న జగ్గారెడ్డి 

తెలంగాణలో  రాబోతున్న వైఎస్ షర్మిల కొత్త పార్టీపై రాజకీయ పార్టీలు నేతల హాట్ కామెంట్స్ చేస్తున్నారు. షర్మిల పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పేరుతో  తెలంగాణలో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల కొత్త పార్టీ తో వస్తుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కి రాకుండా బిజెపి పావులు కదుపుతోందన్నారు జగ్గారెడ్డి. బిజెపి డైరెక్షన్లో కెసిఆర్ పని చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ క్రీడ ఆడుకోవడానికి తెలంగాణను బాల్ లా తయారు చేశారన్నారు. ఆంధ్రా నేతలు ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంకా తెలంగాణకు ఎందుకు... ఉమ్మడి రాష్ట్రంలో కలిపేయండి అంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని హైదరాబాద్ నుంచి పంపించడానికి  ఎన్నో కుట్రలు చేసిన కెసిఆర్..  షర్మిల పార్టీ పై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. 

రాజశేఖర్ రెడ్డి పేరుతో రాజకీయ సొమ్ము చేసుకునేందుకు షర్మిల వస్తుందన్నారు జగ్గారెడ్డి. బీజేపీ, అమిత్ షా, కేసీఆర్ స్క్రిప్ట్ ని షర్మిల చదువుతోందని ఆయన విమర్శించారు. ఈ నాలుగు పార్టీలకు మెగా కృష్ణా రెడ్డి పండింగ్ చేస్తున్నారని తెలిపారు. రక్తం పంచుకున్న కూతురుతో రాజశేఖర్ రెడ్డి సీఎం అవలేదు .. రక్తం పంచుకున్న కాంగ్రెస్ అభిమానులతో రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. రాజశేఖర్ రెడ్డి వారసురాలువు అయితే .. రాజన్న కోరిక నెరవేర్చలనుకుంటే  కాంగ్రెస్ లో చేరాలని షర్మిలకు సూచించారు జగ్గారెడ్డి. రాజశేఖర్ రెడ్డి కల అయిన రాహుల్ గాంధీ ని ప్రధాని చేసేందుకు తమతో కలిసి రావాలన్నారు. అన్న మాట చెల్లి వినదు ..చెల్లి మాట అన్న వినదు  అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల మధ్యే విభేదాలుంటే... వాళ్లు రాజశేఖర్ రెడ్డి వారసులు ఎట్లా అవుతారన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్, షర్మిలలు అమిత్ షా బాణాలన్నారు జగ్గారెడ్డి.