ఏపీ సచివాలయంలోకి ప్రవేశించిన "వెన్నా క్రై"..

ప్రపంచాన్ని గడగడలాడిస్తూ..150 దేశాల్లోని కోట్లాది కంప్యూటర్లను వశం చేసుకున్న వెన్నా క్రై వైరస్ దాటికి వివిధ దేశాలు వణికిపోతున్నాయి. భారత్‌పైనా ఈ వైరస్ పెను ప్రభావం చూపిస్తోంది. ఇప్పటీకే టీటీడీ పరిపాలనా భవనంలోని కొన్ని కంప్యూటర్లు వైరస్ బారిన పడ్డాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు హ్యాకింగ్ గురయ్యాయని ఐటీ నిపుణులు గుర్తించారు. హ్యాకింగ్‌కు గురైన కంప్యూటర్లలో కొత్త హార్డ్ డిస్కులను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. మరోవైపు హ్యాకర్లు వాడిన వైరస్ వెన్నా క్రై వైరసేనా అనే అంశం తెలియాల్సి ఉంది. సచివాలయంలోని సుమారు 20 నుంచి 30 కంప్యూటర్లు‌ హ్యాకింగ్‌కు గురైనట్లు సమాచారం. ఐటీ నిపుణులు కంప్యూటర్లను తిరిగి పునరుద్దరించేందుకు కుస్తీ పడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu