గుజరాత్ సీఎం ఎంపిక...బాధ్యత మొత్తం వీరిద్దరిదే...

 

గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఏదోలా కష్టపడి బీజేపీ గెలిచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు చర్చ సీఎంల ఎంపిక గురించి. సీఎంల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఒక బృందాన్ని గుజరాత్‌కు పంపిన బీజేపీ అధిష్టానం.. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను హిమాచల్ ప్రదేశ్‌కు పంపింది. వీరిద్దరూ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.గుజరాత్‌ సీఎం ఎంపిక బాధ్యతను అరుణ్ జైట్లీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండేకు అప్పగించినట్లు ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుత గుజరాత్ సీఎం విజయ్ రూపానీకే మళ్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తామని పార్టీ చీఫ్ అమిత్ షా తెలిపారు. కానీ బీజేపీ తక్కువ స్థానాలకే పరిమితం కావడంతో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు కొత్త సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu