కేసీఆర్ ఆతిథ్యంపై ఇవాంకా లేఖ...ఇన్ని రోజులకు గుర్తొంచ్చిందా...!

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇవాంక ట్రంప్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇవాంక ట్రంప్ వచ్చినందుకు గాను..తెలంగాణ ప్రభుత్వం చేసిన హంగామా కూడా అందరికీ తెలిసిందే. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా... హైదరాబాద్ ను తీర్చిదిద్దారు. ఆమెకు వచ్చిన దగ్గర నుండి... వెళ్లేంత వరకూ ఆమెకు రాచ మర్యాదలే చేశారు. ఇక ఇవాంక వచ్చింది.. వెళ్లింది.. హడావుడి మొత్తం అయిపోయింది. ఇది జరిగి దాదాపు ఇరవై రోజులైపోయింది. అయితే ఇవాంకాకు ఇప్పుడు గుర్తొచ్చిన్నట్టు ఉందేమో... ఇప్పుడు కేసీఆర్ గారికి లేఖ రాసింది. "ప్రియమైన ముఖ్యమంత్రి కేసీఆర్, జీఈఎస్ సమ్మిట్‌కు హాజరైన నాకు, మీరు ఇచ్చిన ఆతిథ్యం చాలా బావుంది. ఆ పర్యటన నాకు మరిచిపోలేని అనుభవం. పలక్‌నుమా ఫాలెస్‌లో మీరు ఇచ్చిన గిఫ్ట్‌కు ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల ప్రేమకు నేను ముగ్ధురాలినయ్యాను. కుదిరితే ఇంకోసారి ఇండియాకు రావాలనుకుంటున్నాను" అంటూ ఆ లేఖలో రాశారు ఇవాంకా. మొత్తానికి ఇవాంకా వస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం అంత కష్టపడి.. కిందా మీద పడి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఆమె వచ్చి వెళ్లేంతవరకూ.. ఆమె మీద ఈగ కూడా వాలకుండా... గాలిని కూడా కంట్రోల్ లో పెడితే.. ఆమె మాత్రం.. ఇరవై రోజుల తరువాత లేఖ రాయడం ఏంటో..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu