ప్రతి ఏటా ప్రపంచ తెలుగు మహాసభలు - కేసీఆర్
posted on Dec 19, 2017 7:03PM

గత ఐదు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న తెలుగు మహాసభలు ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఈ ఐదు రోజులు మన సాహితీ వైభవాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుకున్నామని.. సభలు విజయవంతంగా అయినందుకు.. ఆశించిన లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉందంటూ మాట్లాడిన మాటలు ప్రతి తెలుగువాడి గుండెను తాకుతాయి. మళ్లీ మళ్లీ ప్రతీ ఏడు డిసెంబర్ లో తెలుగు మహా షభలు కలుసుకుందామని.. తెలుగు భాషని మృతభాషగా కానివ్వకుండా.. బతికించుకుందామని. అసలు ఇలాంటి మాటలు వినిపిస్తేనే బాధనిపిస్తుందని.. తెలుగు భాష ఉనికి మనలో ప్రవహిస్తూ.. తరతరాలకు నిలిచి ఉంటుందని.. అందుకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది అంటూ నవ్వుల పద్యంతో ప్రపంచ తెలుగు మహాసభలకు కేసీఆర్ వీడ్కోలు పలికారు.