పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి అధీనంలోని ప్రభుత్వ భూమి స్వాధీనం

జగన్ హయంలో పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకత్వం ఆకాశమే హద్దన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  పెద్దిరడ్డి పెత్తనం ఇష్టారాజ్యంగా సాగింది. అడ్డూ అదుపూ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  భూ కబ్జాలకు పాల్పడ్డారు. అధికారం అండతో అదికారులను గుప్పిట పెట్టుకుని వింటారని ప్రభుత్వ భూమి... అటవీ భూమి.. ప్రైవేట్ భూములు అన్న తేడా లేకుండా పెద్దిరెడ్డి కబ్జాల పర్వం కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి.  

గత ఎన్నికలలో  వైసీపీ అత్యంత ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే పుంగనూరులో మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తన కబ్జాల వ్యవహారం ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు అందుకున్న వెంటనే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైల్స్ దగ్థం కేసులో కూడా పెద్ది రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  

అన్నమయ్య జిల్లా మదనపల్లి శివారులోని  బీకే పల్లి సర్వే నెంబర్ 552లో ప్రభుత్వ భూమి మొత్తం 10.05 ఎకరాల భూమిలో కొంత భాగం మాజీ సైనికుడికి కేటాయించారు.  ఈ భూమిలో పెద్దిరెడ్డి  1.35 ఎకరాలు   భూమి నుంచి కబ్జా చేశారు. 552-7 సర్వే నెంబర్ లో 3.40 ఎకరాలు, 552-8లో 0.50 ఎకరాల భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత మాజీ సైనికుడు కుటుంబం నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో బైపాస్ రోడ్డు, ఫ్లై ఓవర్ కు 18 సెంట్లు పోయింది. 552-7 ఆనుకుని ఉన్న 552-1 లోని 1.35 ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చారు. మదనపల్లి సర్వేయర్ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ఐ భరత్ రెడ్డి హద్దులు గీసి ఆక్రమణలు తొలగించి 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమి గా తేల్చారు. ఆ భూమిని పెద్దిరెడ్డి అధీనం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu