రూటు మార్చిన గోనె?!
posted on May 29, 2011 1:49PM
హైదరాబాద్:
వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతూ వస్తున్న కరీంగనగర్ జిల్లా రాజకీయ నాయకుడు గోనె ప్రశాశరావు అకస్మాత్తుగా తన రూటును మార్చినట్టుగా కనిపిస్తున్నాడు. వైయస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందినప్పటి నుండి కాంగ్రెసుకు దూరమవుతూ, జగన్‌కు తెలంగాణ ప్రాంతంలో వెంట ఉన్న ముగ్గురు నలుగురు నేతల్లో గోనె ప్రకాశరావు ఒకరు. ఇటీవలి వరకు ఆయన జగన్ ఖచ్చితంగా తెలంగాణకు మద్దతు పలుకుతారని చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి గోనె ప్రకాశరావు ఆదివారం సంచనల వ్యాఖ్యలు చేశారు. జగన్ తెలంగాణకు అనుకూలంగా లేకుంటే తాను టిడిపి నుండి సస్పెన్షన్‌గు గురైన నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ సెంటిమెంటుతో పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.