మార్క్ జుకెర్‌బర్గ్... ఆసక్తికర అంశాలు...
posted on May 16, 2018 9:51AM
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ అంటే మన ఇండియన్లకి ఎంతో ఆసక్తి. ఈ మధ్య మన ప్రధాని జుకర్‌బర్గ్‌ని కలసినప్పటి నుంచి ఆ అభిమానం మరింత పెరిగిపోయింది. జుకెర్‌బర్గ్ మన ‘డిజిటల్ ఇండియా’కి మద్దతుగా తన ఫొటో మీద త్రివర్ణ పతాకాన్ని వచ్చేలా చేయడం అందరికీ బాగా నచ్చేసింది. ఇప్పుడు చాలామంది తమ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫొటోలో త్రివర్ణ పతాకం వచ్చేలా చేసుకునేంతగా జుకెర్‌బర్గ్ ఇన్‌స్పయిర్ చేశాడు. మన ఇండియన్లకు రోజురోజుకూ మరింత దగ్గరవుతున్న జుకెర్‌బర్గ్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పరిశీలిద్దాం.
1. ఫేస్‌బుక్ సీఇఓ హోదాలో మార్క్ జుకర్ బర్గ్ తీసుకుంటున్న నెల జీతం ఎంతో తెలిస్తే మీ కళ్ళు తిరుగుతాయి. ఆ జీతం ఎంత అంటే... కేవలం ఒక్క డాలర్.
2. జుకెర్‌బర్గ్ హార్వార్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో తన హాస్టల్ రూమ్‌మేట్స్‌తో, తన క్లాస్‌మేట్స్‌తో ఎంతో సన్నిహితంగా వుండేవాడు. వాళ్ళందరితో కలిసే ‘ఫేస్‌బుక్’ని స్థాపించాడు.
3. ఫేస్‌బుక్‌ను స్థాపించిన తర్వాత తన 23 ఏళ్ళ వయసులో, అంటే 2007లో జుకెర్‌బర్గ్ బిలియనీర్ అయ్యాడు.
4. కొన్ని ప్రదేశాలకు, సినిమా హాళ్ళకు, టీవీ షోలకు ముందుగా చెప్పకుండా సర్‌ప్రైజ్‌గా విజిట్ చేయడం జుకెర్‌బర్గ్‌కి వున్న ఒక సరదా.
5. ‘ఫేస్‌బుక్’కు జుకెర్‌బర్గ్ మొదట ‘ది ఫేస్‌బుక్’ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత దాన్ని ‘ఫేస్‌బుక్’గా మార్చాడు.
6. తాను స్వయానా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు అయినప్పటికీ జుకెర్‌బర్గ్ గూగుల్ ప్లస్‌లో, ట్విట్లర్లో అకౌంట్లు కలిగి వున్నాడు.
7. ఆగస్టు 2013 సంవత్సరంలో జుకెర్‌బర్గ్ ఇంటర్నెట్.ఆర్గ్ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టు ద్వారా అప్పటి వరకూ ఇంటర్నెట్ అంటేనే తెలియని ఐదు బిలియన్ల ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం సమకూరింది.
8. జుకెర్‌బర్గ్‌కి రెడ్ - గ్రీన్ కలర్ బ్లైండ్‌నెస్ వుంది. అతని నీలి రంగు బాగా కనిపిస్తుంది. అందుకే ఫేస్‌బుక్ అనే అక్షరాలకు నీలిరంగును ఎంపిక చేసుకున్నాడు.
9. జుకర్‌బర్గ్ గ్రే కలర్ టీ షర్ట్‌ను ధరించడాన్ని ఇష్టపడతాడు.
10. జుకర్‌బర్గ్ శాకాహారి. గతంలో మాంసాహారం తినేవాడు. కానీ ఇప్పుడు మానేశాడు