గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలక మలుపు
posted on Jun 23, 2020 3:32PM
గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధం ఉన్న అధికారులకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎన్ కౌంటర్ లో నయీం హతమై చాలా కాలమవుతున్నప్పటికీ.. ఈ కేసులో ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెరపైకి వస్తూనే ఉంది. నయీంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సంబంధాలపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్.. లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్.టి.ఐ చట్టం ద్వారా పోలీసు, రెవెన్యూ అధికారుల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించింది. నయీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు దిగిన ఫొటోలను, వీడియో సాక్ష్యాలను లోక్ పాల్‌కు సమర్పించనుంది. నయీంతో కలిసి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, వారి పాత్రపై విచారణ జరపాలని లోక్ పాల్ ను కోరనుంది. దీంతో, పలువురి అధికారుల జాతకాలు బయటపడే అవకాశముంది.