విదేశీ మీడియాలో జగన్ వార్తలు
posted on May 26, 2012 11:04AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేక జగన్మోహనరెడ్డి దేశీయ మీడియానే కాకుండా విదేశీ మీడియాను సైతం ఆకర్షిస్తున్నారు. జగన్ సిబీఐ ఎదుట విచారణకు హాజరైన వార్తలను, వ్యాసాలను కొన్ని విదేశీ పత్రికలూ, వెబ్ సైట్లు సవివరంగా ప్రచురించాయి.
ఖలీజ్ టైమ్స్, లండన్ కాలింగ్, న్యూస్ వాచ్, ద న్యూస్ హెరాల్డ్ వంటి విదేశీ పత్రికలూ జగన్ వార్తలను, వ్యాసాలను ప్రచురించాయి. రాష్ట్రంలో సిబీఐ చేపట్టిన దర్యాప్తు జాతీయస్థాయిలో కూడా ప్రధాన వార్తల్లో ఒకటిగా మారింది. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం వరకూ ఎండ పెరిగినట్టే టీవీలో న్యూస్ ఛానళ్ళను ఆసక్తితో వదలలేదు. ఎందుకంటే త్వరలోనే జగన్ అరెస్టు అవటం ఖాయమన్న నమ్మకాన్ని కాంగ్రెస్ కల్పించింది. దీనిప్రభావం వల్ల ఎన్నికలలోపే ఆయన అరెస్టు అయితే ఉండబోయే పరిణామాలు గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి.
ప్రత్యేకించి రాజధానికి వెళ్ళే అన్ని దారుల్లోనూ పోలీసు పహారా పెంచటం, జగన్ అభిమానులను నిరోధించటం, ఈ దర్యాప్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో ఇద్దరు అభిమానుల ఆత్మహత్య వంటి పలు సంఘటనలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ గమనించారు. ప్రత్యేకించి ఈ దర్యాప్తు సమయంలో ఎంపీ సబ్బం హరి, ఎమ్మెల్యే ఆళ్ళ నాని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేసినా డోంట్ కేర్ అన్నట్లు ప్రకటించటం, అంబటి రాంబాబు కడిగిన ముత్యంలా తమ నాయకుడు జగన్ బయటికి వస్తాడనటం కూడా చర్చల్లో చోటు చేసుకున్నాయి. ఏదేమైనా ఆరుగంటల పాటు సిబీఐ విచారణ, దానితో పాటు జరిగిన ఆసక్తికరపరిణామాలు టీవీల ముందు రాజకీయ నాయకులను, కార్యకర్తలను, మీడియా పర్సన్ లను, ఉద్యోగులను కట్టిపడేశాయి.