మందు తాగితే.. మంచింది..
posted on Jul 31, 2021 10:01AM
నేటి కాలంలో మందు తాగని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.. ఇకపోతే ఆ మందు తాగడానికి మందు బాబులు రకరకాల కారణాలు వెతుకుంటారు. అమ్మాయి వదిలివెళ్ళిపోయిందని బాధలో తాగుతున్నానని కొందరు చెపితే.. ఆఫీస్ లో బాస్ తిట్టాడని, ఇంట్లో టెన్షన్స్, అప్పులోల బాధలు ఎక్కువ అయ్యాయి అని మరి కొందరు. సంబంధం లేకుండా చాలా మంది మందు తాగుతారు. ఇలా చెపుతూ పొతే మందు బ్రాండ్లు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని కారణాలు మందు తాగడానికి చెప్పుకుంటారు మందు బాబులు. ఇంకొంత మంది ఐతే ఎప్పుడు వైన్స్ షాప్ తెరుస్తారో అప్పుడే వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. ఈ విషయం పక్కన పెడితే..మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే. కానీ, మద్యం సేవిచడం వలన కూడా ఆరోగ్యనికి మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ మద్యం సేవించడం వలన ఆరోగ్యానికి ఏం ప్రయోజనం.. ఎంత మోతాదులో తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మహిళలు మద్యం సేవించడం మంచిదేనా.. వారు ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది చూద్దాం.
మద్యం వలన ఆరోగ్యానికి మంచి జరగాలంటే తగినంత మోతాదులో తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే రోజుకి మహిళలు ఒక డ్రింక్, పురుషులు రెండు డ్రింకులు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. రోజు ఇలా మద్యం తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్ట వచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఒక డ్రింక్ అంటే 12 ఔన్సుల బీరు లేదా 5 ఔన్సుల వైన్ లేదా 1.5 ఔన్సుల లిక్కర్ అయినా తీసుకోవచ్చు. దీని వలన మానసిక ఆనందం పొదవచ్చు. అయితే మరో ముఖ్య గమనిక గర్భిణీలు ఆల్కహాల్ తీసుకోకూడదు. అదే విధంగా లివర్ సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది. అది నిపుణులు పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది. మరో వైపు తాగమని చెపుతూనే చెప్పకనే చెపుతున్నారు ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందువలన సాధ్యమైనంత వరకు మహిళలు మద్యం సేవించకపోవడమే ఉత్తమం. సో మనం గ్రహించాలి ఏ మాట వెనుక ఎవరి స్వార్ధం ఉందో తెలుసుకోలేనంత కాలం మోసపోతావ్ అని చెప్పాడు లెనిన్
మనం కూడా ప్రతి విషయాన్నీ గ్రహించాలి..
మద్యం సేవించడం వలన కలిగే ప్రయోజనాలు..
తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల గుండెజబ్బులు దూరమయ్యే అవకాశాలున్నాయి. కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.తగినంత మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వలన జీవితకాలం కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు మద్యం సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చు. మానసిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు. సో ఆడండి విషయం మనం కొంచం జాగ్రత్త ఉంటే ఏ రోగాలు రావు.. దానికి మద్యం తాగాల్సిన అవసరం లేదు.. మీరే ఆలోచించండి
ఎందుకంటే ఎవడి లైఫ్ వాడికి తెలుసు.. ఎవడి కుటుంబ బాధ్యతలు వాళ్ళకి తెలుసు.