కరీంనగర్లో సైకో వీరంగం
posted on Dec 22, 2015 8:19AM

కరీంనగర్ నగరంలో ఒక సైకో వీరంగం సృష్టించాడు. లక్ష్మీనగర్‌కి చెందిన బబ్లు మంగళవారం ఉదయం తల్వార్‌తో ఇంటి నుంచి బయటకి వచ్చిన బబ్లు స్థానికుల మీద దాడికి దిగాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ అలీ పోలీసు సిబ్బందితో కలసి వచ్చి సైకోను అదుపు చేయడానికి ప్రయత్నించారు. బబ్లు వాళ్ళమీద కూడా దాడి చేశాడు. అలీ మీద దాడి చేసిన సైకో తల్వార్‌తో ఆయన వేలు నరికేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ ఎస్.ఐ. విజయ సారథి సైకో కాళ్ళ మీద కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సైకో దాడిలో హెడ్ కానిస్టేబుల్ అలీతోపాటు 20 మందికి గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.