మంటలేని కొవ్వొత్తి

 

 

'కాండిల్ లైట్ డిన్నర్' చేయటమంటే మీకిష్టమా. అదీ ఇంట్లో, కాని ఆ కొవ్వొత్తులని ఒకటి ఒకటి వెలిగించటం, అవి కరిగి ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద పడతాయో అన్న టెన్షన్ తో ఆ సరదాకి దూరంగా ఉంటున్నారా, అయితే 'లెడ్ ఫ్లేమ్ లైట్' లని తెచ్చుకోండి ఇంటికి. అగ్గిపుల్లతో వేలిగించనక్కర్లేదు, కరిగే భయం ఉండదు. ముఖ్యంగా పొగరాదు, అదెలా అంటే?

చూడడానికి కొవ్వొత్తులా ఉండే ఈ 'లెడ్ ప్లేమ్ లైట్ ' నిజానికి ఓ లైట్. అయితే దీనిని వేయడానికి స్విచ్ అవసరం లేదు. కొవ్వొత్తుని ఆర్పడానికి ఊదినట్లు ఊదితే వెలుగుతుంది. మళ్ళీ ఊదితే ఆరిపోతుంది. విచిత్రంగా వుంది కాదూ.

రెండు చిన్న బ్యాటరీలతో పనిచేసే ఈ ప్లాస్టిక్ క్యాండిల్ ధర కూడా చాలా తక్కువే. ఇంటిని౦డా ఎంచక్కా అందానికి వీటిని అలకరించుకుని కావల్సినప్పుడు ఊదుతూ వెళ్ళటమే. 'బ్లో అన్ ఆఫ్ క్యాండిల్స్' ఎక్కడ దొరుకుతాయి అంటారా? మనస్సు పెట్టి ఆలోచించండీ.

Related Segment News