పొంగులేటి వర్సెస్ పువ్వాడ

ఖమ్మం పాలిటిక్స్ రసకందాయంలో పడింది.  బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన  పొంగులేటి , మంత్రి పువ్వాడ అజయ్ మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంటుంది. పొంగులేటి  ఓ బచ్చా అని పువ్వాడ వాఖ్యానించారు.
పొంగులేటి డబ్బులు చూసుకొని విర్రవీగుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ లో ఉంటూనే తన సొంత పార్టీ నేతలనే ఓడించాలని ఆయన కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు జూపల్లిని కూడా సస్పెండ్ చేసింది బిఆర్ఎస్ . కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పొంగులేటి నోటికి తాళం వేయాలని బిఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. పొంగులేటికి కౌంటర్ ఇచ్చేందుకు పువ్వాడ సిద్దమయ్యారు. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ సిద్ధాంతం, విలువ లేని నేత అన్న పువ్వాడ పొంగులేటి తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఏపార్టీలోకి వెళ్ళాలనేది తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నారన్నారు. ఇక పేదలను పీడించుకొని తిన్న దోపిడీదారులే ఆయన పంచన చేరారని, ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి  ఒక బచ్చా అని పువ్వాడ ధ్వజమెత్తారు.
పువ్వాడ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 
 ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అజయ్ కుమార్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పువ్వాడపై బచ్చాగాడిని పెట్టినా గెలిపిస్తానని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.