హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
posted on Mar 1, 2025 5:38AM
.webp)
హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మణికొండ పాషా కాలనీలో ఓ ఇంట్లో జరిగగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతులలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి వేగంగా ఫస్ట్‌ఫ్లోర్‌కి వ్యాపించాయి.. దట్టమైన పొగ.. మంటలతో.. ఇంట్లోనే చిక్కుకుపోయిన ముగ్గరూ ఊపిరాడక మరణించారు. అగ్ని ప్రమాదం సమాచారం తెలిసి వెంటనే అగ్నిమాపక దళం చేరుకుని మంటలను అదుపు చేసింది.
భవనంలో చిక్కుకున్న పలువురిని సురక్షింతగా బయటకు తీసుకు వచ్చారు. అయితే ముగ్గురు మాత్రం పొగతో ఉక్కిరిబిక్కిరై మరణించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భవనంలో ప్రమాదం జరగడానికి కారణం షార్ట్ సర్క్యూటా లేక గ్యాస్ సిలెండర్ పేలుడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మృతులను సహార (40), జమిల (70), సిజిర (7)గా గుర్తించారు. మంటలు మొదటి అంతస్తుకు వ్యాపించి దట్టమైన పొగ అలుముకోవడంతో వీరు ఉక్కిరిబిక్కిరై అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్ట్రెచ్చర్ల సాయంతో వీరిని బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురూ మరణించారు.