ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది మావోలు హతం

ఛత్తీస్ గఢ్ లో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోలు హతమయ్యారు. మావోయిస్టుల సంచారంపై అందిన సమాచారం మేరకు పోలీసులు గంగలూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా మావోలు ఎదురు పడటంతో  ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పులలో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. కొందరు గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

 కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 8మంది నక్సలైట్లు మృతిచెందగా, మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నక్సల్స్ కు, పోలీసులకు మధ్య ఎదురెదురు కాల్పులు కొనసాగుతున్నాయి.