వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా బడ్జెట్.. చంద్రబాబు

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ను అభినందించారు.  

పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని ప్రశంసించారు.  వచ్చే ఐదేళ్లలో   కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ బాటలు వేసిందన్నారు.   బడ్జెట్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.