నిర్మలమ్మ పద్దులో ఏపీకి కేటాయింపులివే!

కేంద్ర బడ్జెట్‌ 2025-26లో ఏపీకి అంతంత మాత్రపు కేటాయింపులే దక్కాయి. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో బలమైన మిత్రపక్షమైనా కేటాయింపుల విషయంలో సముచిత ప్రాధాన్యత దక్కలేదన్న విమర్శలు వినవస్తున్నాయి.

బడ్జెట్ లో అమరావతి ప్రస్తావనే లేకుండా పోయింది.    పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ పోర్టుకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు. అయితే  ఆ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నయాన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.  పోలవరం ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్ లో కేంద్రం రూ.5,936 కోట్లు కేటాయించింది. అయితే ఇక్కడ చెప్పుకోవలసిదేమిటంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్‌ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్ల కేటాయింపులు చేసింది. దీంతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు బడ్జెట్‌లో కేటాయించారు.ఇవి వినా ఏపీ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.