తెరాసకు ఎన్నికల సంఘం నోటీసులు
posted on Oct 27, 2018 11:42AM

తెలంగాణలో అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంది.అందులోనూ కొన్ని రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడింది.ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలుపై ద్రుష్టి పెట్టింది ఎన్నికల సంఘం.ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల కోడ్ ను ఉల్లంగించిదని తెరాస పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక తొలిసారిగా, అది కూడా అధికార పార్టీకి నోటీసులు జారీ అయ్యాయి.మంత్రుల నివాస ప్రాంగణం, అధికారిక భవనాల్లో పార్టీ ఎన్నికల భేటీలు నిర్వహిస్తున్నారని మహాకూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా తెరాస జనరల్ సెక్రటరీ కే కేశవరావుకు నోటీసులు జారీ చేసింది.