కోదండరాంకు అగ్గిపెట్టె కేటాయించిన ఎన్నికల సంఘం

 

2018 మార్చి 31న కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జనసమితి ఏర్పాటైంది.తెలంగాణలో కేసీఆర్‌ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమితో తెజస జట్టుకట్టి ఎన్నికల బరిలో నిలుస్తుంది.అయితే పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు అయితే పొందింది గాని పార్టీ గుర్తును మాత్రం ఎన్నికల సంఘం కేటాయించలేదు.దీంతో కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపైనే పోటీచేయాలని ఇటీవల కాంగ్రెస్‌ నేతలు కొందరు ప్రతిపాదించగా కోదండరాం మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తుతో బరిలోకి దిగను అని తేల్చిచెప్పారు.ఎన్నికల సంఘం తమ పార్టీకి గుర్తు కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కోదండరాం అనుకున్నట్లే తాజాగా ఎన్నికల సంఘం ఆ పార్టీకి అగ్గిపెట్టను గుర్తుగా కేటాయించింది.రాష్ట్రంలో మొత్తం 15 రాజకీయ పార్టీలకు కొత్తగా ఎన్నికల గుర్తులు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.ఎన్నికల సంఘం తెజసకు అగ్గిపెట్టె గుర్తును కేటాయించడంతో తమ పార్టీ గుర్తుపైనే తెజస పోటీ చేయనుంది.