ఢిల్లీలో భూకంపం... రిక్టర్ స్కేల్ పై 5.6 గా నమోదు

ఢిల్లీలో సోమవారం (నవంబర్ 6) భూమి కంపించింది. రిక్టర్  స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.6గా  నమోదైంది. వరుస భూకంపాలు ఢిల్లీ వాసులను వణికిస్తున్నాయి. మూడు రోజుల కిందట అంటే శుక్రవారం (నవంబర్ 3) నేపాల్ లో సంభవించిన భూకంప ప్రకంపనలు ఢిల్లీని కూడా తాకిన సంగతి తెలిసిందే.

అప్పుడు హస్తినలో సంభవించిన భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నా మూడు రోజుల వ్యవధిలో ఢిల్లీలో మళ్లీ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   మూడు రోజుల్లో ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండో సారి.  అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం లేదు.