టెస్ట్ క్రికెట్‌కు డుమిని వీడ్కోలు

దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మెన్ జేపీ డుమిని టెస్ట్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు డుమిని తెలిపాడు. దానికి తోడు ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 4 టెస్టుల మ్యాచ్‌‌ల సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి డుమిని 17 పరుగులు మాత్రమే చేశాడు..దీని కారణంగా తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన డుమిని టెస్టులకు వీడ్కోలు పలికాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా ఇవాళ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన డుమిని ఇప్పటి వరకు 46 టెస్టులాడిన డుమిని 74 ఇన్నింగ్స్‌ల్లో 2,103 పరుగులు చేశాడు..అత్యధిక వ్యక్తిగత స్కోరు 166 పరుగులు. 108 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 6,774 పరుగులు చేశాడు.