విమానంలోంచి దూకేసిన పైలట్

 

ఓ విమానం పైలట్ విమానం గాల్లో వుండగానే దాంట్లోంచి కిందకి దూకేశాడు. ఆ తర్వాత ఆ విమానం కూడా కూలిపోయింది. వెనెజులా దేశానికి చెందిన ఓ అక్రమ మత్తుపదార్థాల రవాణా విమానం టన్నుకు పైగా కొకైన్తో కొలంబియాకి బయల్దేరింది. అయితే ఆ విమానాన్ని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన పైలట్ విమానంలోంచి కిందకి దూకేశాడు. దూకేశాడు. ఆ తర్వాత ఆ విమానం కొలంబియా తీరంలో కూలిపోయింది. పోనీ విమానంలోంచి దూకేసిన పైలట్ బతికాడా అంటే అదీ లేదు. అతను కూడా చనిపోయాడు. అతడి మృతదేహాన్ని కొలంబియా తీరప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకొంది.