డ్రగ్స్‌ నిర్శూలనకు చేయిచేయి కలుపుదాం : చిరంజీవి

 

డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్ టీవర్క్స్‌ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ వర్చువల్‌ సందేశం పంపారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామన్నారు. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు. 

డ్రగ్స్‌ను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రేడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పబ్‌లు, క్లబ్బుల్లో స్నిఫర్ డాగ్స్‌తో నార్కొటిక్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్‌ను అరికట్టేందుకు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రహారీ క్లబ్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu