Don't Skip Your Breakfast
posted on Aug 26, 2019 3:38PM
ఉదయం లేచింది మొదలు ఉరుకులు, పరుగులు. ఆ పరుగుల్లో ‘బ్రేక్‌ఫాస్ట్’ని స్కిప్ చేయాటం సర్వసాధారణం. ఇలా బ్రేక్ ఫాస్ట్‌ని మిస్ చేస్తే ఆరోగ్యం దబ్బతినటం ఖాయం అంటున్నారు నిపుణులు. దాదాపు ఎనిమిది గంటలసేపు సుధీర్ఘమైన నిద్రలో గడిపెస్తాం. అంటే దాదాపు ఎనిమిది గంటలు ఖాళీ కడుపుతో ఉంటాం మనం. ఉదయం లేవగానే శరీరం శక్తికోసం తహతహలాడుతూ వుంటుంది. ఆ సమయంలో మనం బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ఉదయాన్నే మన ఒంట్లోని ఫాట్ వేగంగా కరుగుతుందని గుర్తించారు పరిశోధకులు. సరిగ్గా ఆ సమయానికే మనం బ్రేక్‌ఫాస్ట్ చేస్తే, జీవక్రియ వేగంగా జరిగి కొవ్వూ, క్యాలరీలు చక చకా కరిగిపోతాయట. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ని మిస్ చేస్తే ఊబకాయం, రక్తహీనత వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది అంటున్నారు నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్ చేయమన్నారు కదా అని, ఏ పదింటికో తినటం కాదు నిద్రలేచిన గంటా, గంటన్నారలోపు తినాలట. అప్పుడే రోజంతా చలాకీగా మన పనులు మనం చేసుకోగలం.