అమెరికాను వణికిస్తున్న ల్యాప్‌టాప్‌లు....
posted on May 13, 2017 12:08PM

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ వణుకు పుట్టిస్తుండగా... ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఓ విషయంలో మాత్రం వణుకుతున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ట్రంప్ ప్రభుత్వాన్ని వణికిస్తుంది ఎవరనుకుంటున్నారా.. ? ల్యాప్‌టాప్‌లు. ఉగ్రవాదులు ల్యాప్‌టాపుల్లో బాంబులు అమర్చి విమానాలను పేల్చివేసే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీంతో దీంతో ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇది వరకే విధించిన నిషేధాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఐరోపా దేశాల నుంచి వచ్చే విమానాల్లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై నిషేధం విధించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈ ప్రతిపాదనను అంతర్గత భద్రత శాఖ పరిశీలిస్తుందని.. అంతర్గత భద్రత శాఖ అధికార ప్రతినిధి డేవిడ్ లపాన్ తెలిపారు.