ట్రంప్ కు షాక్... సీక్రెట్ సర్వీస్ లాప్‌టాప్ చోరీ
posted on Mar 18, 2017 11:12AM

అందిరికి షాకులిచ్చే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే.. ట్రంప్ టవర్ కు సంబంధించిన కీలక సమాచారం చోరీ చేయబడింది. అసలు సంగతేంటంటే..ట్రంప్ టవర్‌కు సంబంధించిన కీలక సమాచారమున్న ఓ యూఎస్ సీక్రెట్ సర్వీస్ లాప్‌టాప్ చోరీకి గురైంది. బ్రూక్లిన్‌లోని బాత్ బీచ్ ప్రాంతంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వాహనం నుంచి ఆమె బ్యాగ్, లాప్‌టాప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాగ్, ఇతర వస్తువులను రికవరీ చేశామని.. లాప్‌టాప్ మాత్రం ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు. హిల్లరీ క్లింటన్ ప్రైవేటు ఈమెయిళ్ల కేసుకు సంబంధించిన వివరాలు, పోప్ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా ఆ లాప్‌టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.