ఆగ్రాలో రెండు పేలుళ్లు...

 

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో తాజ్ మహల్ ను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు ఈ బెదిరింపులో భాగంగానే రెండు పేలుళ్లు సంభవించాయి. ఆగ్రా కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఇవి జరిగాయి. తొలుత స్టేషన్‌కు సమీపంలోని అశోక్‌ అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై పేలుడు జరగగా, 45 నిమిషాల తర్వాత స్టేషన్‌లోని ఐదో నెంబర్‌ ప్లాట్‌ఫాం సమీపంలో చెత్తవేసే చోట మరో పేలుడు సంభవించింది. తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ బృందం కూడా అక్కడికి చేరుకుని పరిశీలిస్తోంది. పేలుళ్లకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu