ఇష్టమైన పదవికి స్టాలిన్ దూరం...
posted on Jan 7, 2017 2:08PM
.jpg)
డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఎన్నో ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డీఎంకే యూత్ విభాగం కార్యదర్శిగా బాధ్యతలనుండి తప్పుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడున్నర దశాబ్దాలుగా డీఎంకే యూత్ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు స్టాలిన్. స్టాలిన్ స్థానంలో డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.పి. సామినాథన్‌కు నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామినాథన్ పార్టీ చీఫ్ కరుణానిధిని కలిసి ధన్యావాదాలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేస్తానని.. తిర్పూర్ జిల్లాలో అన్నాడీఎంకే దీటుగా డీఎంకేను అభివృద్ధి చేస్తానని తెలిపారు.
కాగా స్టాలిన్ డీఎంకే యూత్ విభాగాన్ని 1980-81 సమయంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆయన యూత్ వింగ్ పోస్టు నుంచి తప్పుకోవడానికి విముఖత చూపించారు.